సొమ్మొకరిది.. ప్రచారం మరొకరిది
- రేషన్ బ్యాగులు, రిసిప్ట్‌లపై పీఎం ఫొటో ఉండాలి
- మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తోంది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): రేషన్ బ్యాగులపై, రిసిప్ట్‌పై ప్రధాన మంత్రి మోదీ ఫొటో తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే బీజేపీ తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వబడే 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభు త్వ నిధుల ద్వారా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమే అందిస్తోందని, బియ్యం కొనుగోలు చేసి మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు.
కానీ, సొమ్మొకరిది.. ప్రచా రం మరొకరిది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభు త్వం సన్నబియ్యం పంపిణీ చేసే కొత్త బ్యాగులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్ట కుండా, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయ త్నం చేస్తోందన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్-2026లో భాగంగా ఉస్మాని యా వర్సిటీలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్- రాజకీయంగా వేర్వేరుగా ఉన్నప్పటికీ, ప్రజలు ఎల్లప్పుడూ కలిసుండాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతా ల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని బలోపేతం చేసే ఉద్దేశంతో వీబీజీరామ్‌జీ యాక్ట్ -2025ను ప్రవేశపెట్టిం దని, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టంపై దుష్ర్పచారం చేస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి అద్భుత స్పందన, ఆదరణ లభించబోతుందని తెలుసుకుని కాంగ్రెస్ భయపడుతోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలనను, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనను చూశారని, ఈ రెండు పార్టీలు బీజేపీపై తప్పు డు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటున్నాయని పేర్కొన్నారు.
న్యాయం కోసం పోరాడాలి
బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించి, పలు అంశాలపై రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్, కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదులు న్యాయం కోసం పోరాడాలని సూచించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో అనేకచోట్ల ఓటర్ లిస్టులు తారుమా రు చేయడం, ముఖ్యంగా హైదరాబాద్‌లో మజ్లి స్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలనే ఉద్దేశంతో ఓట్లు పెంచారని విమర్శించారు. బీజేపీ లీగ ల్‌సెల్ ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా, ప్రజల అభ్యంతరాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. రేపు మున్సిపాలిటీల్లో, ఓటర్ లిస్టులో అవకతవకలపై పోరాటం కొనసాగించాలని సూచించారు.
బీజేపీ 2026 డైరీ ఆవిష్కరణ
బీజేపీ తెలంగాణ రాష్ర్ట శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీని శనివారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి వేముల అశోక్, పార్టీ రాష్ర్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్, బీజేపీ తెలంగాణ పీఆర్వో పరమేశ్ పాల్గొన్నారు.






