22 June, 2026 | 2:28 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం

12-03-2026 12:01 AM

మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ 

ఇల్లందు టౌన్, మార్చి 11 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మాజీ కౌన్సిలర్ తోట లలిత శారద ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ 25 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.

గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేవారని, ప్రస్తుతం ఆ కార్యక్రమం నిలిచిపోయిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు సిలివేరు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ జబ్బార్, కౌన్సిలర్ పాబోలు స్వాతి, మాజీ కౌన్సిలర్ తార, పట్టణ నాయకులు పాబోలు కిరణ్, గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, చాంద్ పాషా, మీర్జాబేగ్, బిపిన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.