calender_icon.png 18 November, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యంత హృదయ విదారక ఘటన

18-11-2025 12:55:04 AM

  1. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలి
  2. బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): సౌదీ అరేబియాలో బస్సు ప్రమా దం ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో ప్రయాణికులు, తెలంగాణవాసులు దుర్మరణం చెందడం అత్యంత హృదయ విదారకమైన ఘటన అన్నారు.  ఈ ఘటన రాష్ట్రాన్ని తీవ్రవిషాదంలోకి నెట్టిందని, ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబాల పట్ల బీజేపీ తెలంగాణ రాష్ర్ట శాఖ సంతాపం వ్యక్తం చేస్తోందన్నారు. 

మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయం లో భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదం అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ అత్యంతవేగంగా చర్యలు ప్రారంభించిందని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం చేసి, మృతదేహాల తరలింపు సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.