calender_icon.png 18 November, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సైన్స్ ఆఫ్ సర్వువల్’కు ప్రాధాన్యం

18-11-2025 12:55:54 AM

మెడికవర్ వరల్డ్ ప్రీమ్యాచ్యూరిటీ డే 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో వరల్డ్ ప్రీమ్యాచ్యూరిటీ డే నిర్వహించారు. నెలలు నిం డకుండా జన్మించిన శిశువులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, నర్సులు, ఎన్‌ఐసీయూలో చికిత్స పొంది ఇప్పుడు ఆరోగ్యంగా ఎదుగుతున్న చిన్నారులు పాల్గొన్నారు. చిన్నారుల బలమైన జీవన పోరాటం, కుటుంబాల సహనం, వైద్య బృం దాల అంకితభావం ఈ కార్యక్రమానికి ప్రధాన సందేశాలుగా నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 15 మిలియన్ శిశువులు ప్రీటర్మ్‌లో జన్మిస్తుండగా, వాటిలో 3.5 మిలియన్ కేసులు భారతదేశంలోనే నమోదవుతుండటం ఆందోళనకరం. ఈ పరిస్థితుల్లో నియోనాటాలజీ  కేర్లో అత్యుత్తమ సేవలను అందించే కేంద్రంగా మెడికవర్ ప్రత్యేక స్థానా న్ని సంపాదించింది. గత నాలుగేళ్లలో ఆసుపత్రి 1,200 కంటే ఎక్కువ న్యూబోర్న్ శిశువుల ను, అందులో 680 మంది ప్రీటర్మ్ బేబీలను కాపాడింది.

అత్యాధునిక పరికరాలతో కూడిన 25 పడకల లెవల్ III ఎన్‌ఐసీయూ, నిపుణుల నియోనాటాలజీ  బృందం, నిరంతర మానిటరింగ్ సదుపాయాలు కలిసి అనేక క్లిష్ట పరిస్థి తులను విజయవంతంగా ఎదుర్కొంటున్నా యి. 23 వారాల గర్భదశలో, కేవలం 550, 970 గ్రాముల బరువుతో జన్మించిన శిశువులు కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఎదుగుతున్నది ఈ కేంద్రం సేవలకు నిదర్శనం.

ప్రధాన అతిథిగా హాజరైన డా. హరికిృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ.. ‘మెడికవర్లో మా లక్ష్యం కేవలం చికిత్స కాదు ప్రతి బిడ్డకు ఆరోగ్యమైన భవిష్యత్తుకు అవకాశం కల్పించడం’ అన్నారు. నియోనాటాలజీ సేవలపై డా. రవీందర్‌రెడ్డి పరిగె, డైరెక్టర్ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ మాట్లాడుతూ.. ‘ప్రీటర్మ్ బేబీ ప్రయాణం ఎంతో ప్రత్యేకం. కుటుంబాలు నెలల తరబడి ఎన్‌ఐసీయూలో గడుపుతాయి’ అన్నారు.