18 July, 2026 | 1:40 AM

వాస్తవ ఘటనలకు కల్పిత కథ జోడిస్తే..

18-07-2026 01:40 AM

కళ్యాణం కమనీయం జీవితం 

ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకుడు. వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మిబల్ల ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ విడుదల చేస్తున్నారు.

మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి  సత్యన్నారాయణరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ.. “కళ్యాణం కమనీయం జీవితం’ ఒక కొత్త తరహా కథ, కథనంతో అందరినీ ఆకట్టుకుంటుంది” అని తెలిపారు.

హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ.. “మా సినిమా ప్లెజెంట్‌గా ఉంటూనే చివరలో ఒక మంచి ట్విస్ట్‌తో ఆకట్టుకుంటుంది” అని చెప్పారు. చిత్ర దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. “నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు మరికొన్ని ఊహాత్మకమైన అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను.  రైటర్ అరవింద్ జత చేసిన ఒక కొత్త పాయింట్‌తో మూవీ స్క్రిప్ట్ మరింత ఆసక్తికరంగా మారింది” అని చెప్పారు. ‘ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని నిర్మాత కిషోర్ గుండాల తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం కూడా మాట్లాడారు.