06-02-2026 12:00:00 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పని చేస్తున్న మహిళా యువ న్యాయవాది స్వప్న దారుణ హత్య ఘటనను జిల్లా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ స్వప్న హత్య సమాజంలో హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై ముఖ్యంగా మహిళా న్యాయవాదులపై జరుగుతున్న ఇటువంటి హింసాత్మక దాడులు నాగరిక సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కావని ఆయన పేర్కొన్నారు.
మృతురాలి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని బాధ్యులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సేవకై పనిచేస్తున్న న్యాయవాదులపై ఇటీవలి కాలంలో జరుగుతున్న అమా నుష దాడులు, హత్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వం మేల్కొని న్యాయవాదుల భద్రతకు హామీ ఇచ్చే ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
న్యాయవాదుల దాడులు న్యాయ వ్యవస్థకు వెన్నెముకైన న్యాయవాదుల మనుగడ ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది, ప్రభుత్వం న్యాయవా దులపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తక్షణమే న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.