ఎమ్మెల్యేలకు మున్సిపోల్ సవాల్..
- నియోజకవర్గానికో మున్సిపల్
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు
మున్సిపల్ పీఠాలు దక్కేది ఎవరికో....?
ఉత్కంఠ రేపనున్న బల్దియా ఎన్నికలు
కామారెడ్డి, జనవరి 14 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుత ఎమ్మెల్యేలకు సవాల్ గా మారనున్నాయి. కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా నాలుగు మున్సిపల్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు ఒక మున్సిపల్ ఉండడంతో ఎమ్మెల్యేలకు మున్సిపల్ పీఠాన్ని తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బలమైన వార్డు సభ్యులను ఎంపిక చేసి తమ పార్టీ తరపున పోటీ చేయించేందుకు కసరత్తులు చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ గతంలో బిఆర్‌ఎస్, కు చెందిన మున్సిపల్ చైర్మన్ గా నీట్టు జాహ్నవి పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బిఆర్‌ఎస్ చైర్మన్ జహ్నవి ని దింపి కాంగ్రెస్ పార్టీ లోకి టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి వైస్ చైర్మన్ గా ఉన్న గడ్డం ఇందుప్రియ చైర్మన్ గా ఎన్నికయ్యారు. టిఆర్‌ఎస్ కు చెందిన పలువురు కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరడంతో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కి చెందిన గడ్డం ఇందుప్రియ ఎంపికయ్యారు.
ఈసారి కూడా కాంగ్రెస్కు చెందిన మున్సిపల్ చైర్మన్ గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి బిజెపి ఎమ్మెల్యేగా ఉండడంతో బిజెపి కి చెందిన వారిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించేందుకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కామారెడ్డి మున్సిపల్ ఎన్నిక సవాల్ గా మారింది.
అధికారం లేకున్నా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో పాటు స్థానికంగా ఎమ్మెల్యే గా ఉన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈసారి కామారెడ్డి మున్సిపల్ ను బిజెపి కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. బాన్సువాడ మున్సిపల్ గతంలో టిఆర్‌ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. గతంలో ఆయన అనుచరుడే టిఆర్‌ఎస్ కు చెందిన గంగాధర్ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్కు చెందిన వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఉండడంతో మున్సిపల్ పీఠాన్ని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని గెలిపించుకునే కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండడంతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని గెలిపించే బాధ్యత పోచారం పై ఉంది.
తన ప్రెస్టేజికి సవాల్ గా మారింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడంతో బిచ్కుంద కొత్త మున్సిపాలిటీగా అవతరించడంతో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కసరత్తు చేస్తున్నారు. బి.ఆర్.ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే సైతం బిచ్కుంద మున్సిపాలిటీపై బిఆర్‌ఎస్ జెండా ఎగురవేసి ఎగురవేసి తన ప్రాబల్యాన్ని చాటుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠం గతంలో బిఆర్‌ఎస్ కు చెందిన సత్యనారాయణ ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొందరు వార్డు కౌన్సిలర్ లు కాంగ్రెస్లో చేరడంతో మున్సిపల్ పీఠాన్ని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్రావు కైవసం చేసుకున్నారు. పద్మ శ్రీకాంత్ కాంగ్రెస్కు చెందిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లారెడ్డి పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కామారెడ్డి పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు.
కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అని లక్షలు విలువచేసే సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభిస్తూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమంటూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ,జుక్కల్, నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కసరత్తు చేస్తున్నారు. కామారెడ్డి లో మాత్రం బిజెపి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మెజార్టీ బిజెపి కౌన్సిలర్లను గెలిపించి కామారెడ్డి మున్సిపల్ పీఠం బిజెపికి కైవసం చేసుకునేలా కసరత్తు చేస్తున్నారు. బల్దియా ఎన్నికలు నలుగురు ఎమ్మెల్యేలకు సవాలుగా మారాయి. ఎవరికివారుగా తమ ప్రాతినిధ్యాన్నిy చాటుకునేలా కసరత్తు చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా కామారెడ్డి లో అధికార పార్టీకి చెందిన షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు పలు అభివృద్ధి పనుల కు శంకుస్థాపనలు చేస్తూ కాంగ్రెస్కు చెందిన వారిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందంటూ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేలు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కామారెడ్డిలో మాత్రం బిజెపి ఎమ్మెల్యే ఉండడంతో తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు నలుగురు ఎమ్మెల్యేలకు సవాల్ గా మారాయి. మున్సిపల్ పీఠాలను ఎవరు కైవసం చేసుకుంటారో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.






