15-01-2026 02:14:02 AM
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి, సంక్రాంతి సంబరాలు
ఎస్పీ ఆధ్వర్యంలో ‘కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్’ ఘనంగా నిర్వహణ
అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేసిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి, జనవరి 14 (విజయక్రాంతి): పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీస్ కుటుంబాలతో కలిసి కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. అంతకుముందు భోగి మంటలు కాల్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పండుగ వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యతను పరస్పర స్నేహాన్ని మరింత బలపేతం చేస్తాయన్నారు. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్య పోలీస్ సిబ్బందికి ఈ తర కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని కొత్త ఉత్సవాన్ని అందిస్తాయన్నారు.
అదేవిధంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనీస్ మాంజా నైలాన్ మాంజా వాడకూడదని తెలిపారు. మాంజా వాడడం వల్ల పక్షులకు మాత్రమే కాకుండా వాహనదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారు తాయి అని ప్రజలుగా గ్రహించాలని కోరా రు. కైట్లను ఎగుర వేసేందుకు నువ్వులు దారం మాత్రమే ఉపయోగించాలని సూచించారు. పండుగ లు ఆనందాన్ని పంచాలి కాని విషాదాన్ని మిగిల్చకూడదని ఎస్పి అన్నారు.
సాంప్రదాయాలను గౌరవిస్తూ భద్రత నియమాలను పాటించాలన్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా ఆనందంగా ఉండాలన్నదే పోలీస్ శాఖ సంకల్పమని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలకు ఎస్పీ రాజేష్ చంద్ర భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో భోగి మంటలను కాచి పతంగులను కుటుంబ సభ్యులతో కలిసి ఎగురవేస్తూ ఆనంద ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పి చైతన్య రెడ్డి, ఆ రైలు సంతోష్ కుమార్ కృష్ణ ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కైట్ ఫెస్టివల్లో పాల్గొని పతంగులు ఎగరవేసిన పోచారం, కాసుల...
బాన్సువాడ: తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండగ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ( పతంగుల పండుగ ) లో పాల్గొని పట్టణ వాసులు, చిన్నారులతో కలిసి కైట్ (పతంగి) ను ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రజా ప్రతినిధులతో కలిసి పతంగులను ఎగరవేశారు.
చిన్నారితో కలిసి గాలిపటాలని ఎగరవేయడం చాలా సంతోషంగా ఉందని కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు చిన్నారులు తదితరులు ఉన్నారు.
ఏర్గట్లలో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం
ఏర్గట్ల: ఏర్గట్ల మండలం లోని బట్టాపూర్ లో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ సంక్రాంతి యుపండుగను పురస్కరించుకొని గ్రామంలో ముగ్గుల పోటీ లాను నిర్వహించారు ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలు యువతులకు బహుమతులను ఏర్గట్ల ఎస్త్స్ర పడాల రాజేశ్వర్ స్థానిక ఉపసర్పంచ్ మూడ్ దయనంద్, మహిళ కానిస్టేబుల్ శ్రావణి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి వారి ప్రతిభను గుర్తించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ సమాఖ్య మండల అధ్యక్షురాలు కుందేన లక్ష్మి, మహిళ సంఘాల వివో ఏ లు లక్ష్మి,లావణ్య, స్థానిక వార్డ్ మెంబర్ సారంగి ముత్తెమ్మ, స్థానిక యువకులు గోరె మియా, కట్కామ్ శమంత్ రెడ్డి, చరణ్, రామకృష్ణ యాదవ్, తదితరులు, పాల్గొన్నారు.
బీర్కూర్‌లో..
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ పరమేష్ పంతులు ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా బుధవారం గ్రామం లోని పిల్లలకు గాలిపటాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీర్కూరులోనీ గాంధీ చౌక్ లో హనుమాన్ ఆలయం వద్ద ఉపసర్పంచ్ పరమేష్ పంతులు మరియు గ్రామ వార్డు సభ్యులతో పిల్లలకు గాలిపటా లు వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల విట్టల్ మాట్లాడుతూ ముందుగా బీర్కూర్ గ్రామ ప్రజలకు భోగి, కాంక్రంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ భోగి పండగ అంటే ఉన్న చల్లటి వాతావరణం నుండి వెచ్చదనం పొందడానికి ఇంట్లో పాత వస్తువులు వారివి తీసుకొచ్చి బోగిమంటలో వేసి వెచ్చదనాన్ని పొందుతారని అలాగే చిన్నపిల్లలకు ఇష్టమై న గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందాన్ని పొందుతారని అన్నారు.
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పాడి పంటల్లో లాభాలు చేకూరాలన్నారు. ఈ కార్యక్రమం లో ఏఎంసీ వైస్ చైర్మన్ యామ రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్యాపురం శశికాంత్, అవారి గంగారాం, సందీప్, వార్డు సభ్యులు హైమద్, గొల్ల ప్రశాంత్, కోరిమే రఘు, మద్నూర్ శంకర్, మెలిగే మహేష్, అరిగే భాస్కర్, మెంటే మధు, ఆనంద్, సత్యకిరణ్, సాయికుమార్ పాల్గొన్నారు.