9 May, 2026 | 3:48 AM

జాతీయ పతాకం.. రాజుగారి గడిలోనే తొలిరూపం

26-01-2025 12:00 AM
  1. పింగళి వెంకయ్య మదిలో స్పురణం 
  2. విజయవాడ కాంగ్రెస్ మహాసభలో ఆమోదం
  3. ఎల్లలు దాటిన నడిగూడెం ఘనకీర్తి           
  4. త్రివర్ణ పతాకమే దేశ ప్రజల ఐక్యమత్యానికి ప్రతీక

నడిగూడెం జనవరి 25 : నడిగూడెం రాజా వారి కోటకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. తెలంగాణలోని 24  గడిలలో ఇది ఒకటి ఇంత పరిజ్ఞానం సాధించిన నాటి కట్టడాలు కళా నైపుణ్యం ఇప్పటికీ చూప రులను  అబ్బురపరుస్తున్నాయి. యావత్ భారతదేశం సెల్యూట్ చేసే జాతీయ పతాకం ఈ కోటలోనే పింగళి వెంకయ్య చేతుల్లో పురుడు పోసుకుంది.   

రాజావారి కోటలో పనిచేస్తున్న పింగళి  వెంకయ్య పత్తి వంగడాల శాస్త్రవేత్తగా పనిచేసేవాడు.  జెండా రూప కల్పన కు  కోసం దేశ వ్యాప్తంగా   గాంధీ పిలుపు నివ్వడం  పింగళి వెంకయ్య  తయారు చేసిన జెండాను పంపించడంతో   విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో  చిన్న చిన్న మార్పులతో ఆమోదించారు.

కోటను పర్యాటక కేంద్రంగా చెయ్యాలి

జాతీయ జెండా రూప కల్పన జరిగి ఈ కోటను ప్రజలు చూడడానికి వీలుగా  చెయ్యాలని, ఒక పర్యాటక ప్రాంతంగా రూపు దిద్ధాలని  గ్రామస్తులు  కోరుతున్నారు. ఐతే ఇప్పటికే ఆ కోటలో నివాసం ఉంటున్న వారు కోట లోపలికి గ్రామస్తులను  అనుమతించక  పోవడం తో  గ్రామప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

112 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు..

ఇటీవల కాలంలో కోటలో  డాక్రి సంస్థ ఆధ్వర్యంలో 112 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేశారు. డిసెంబర్ 2024 లో జెండా ట్రైల్ రన్ చేశారు.  త్వరలో  జాతీయజెండా ఆవిష్కరించనున్నారు.