15 August, 2026 | 3:06 PM

ఉత్తమ అవార్డులు అందుకున్న అదనపు కలెక్టర్లు

15-08-2026 02:18 PM

నిర్మల్ ఆగస్టు 14 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ అవార్డుల పంపిణీ ప్రభుత్వ చీఫ్ వీప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా అధికారులు అవార్డులను స్వీకరించారు. అవార్డు స్వీకరించిన వారిలో స్థానిక సంస్థల అదనపుకలెక్టర్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, ఏ ఎస్ పి సాయికుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ తో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులకు ఈ అవార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో  భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, నిర్మల్ డిఎఫ్ఓ ప్రశాంత్ సుఖదేవ్ ఆర్ డి ఓ రమేష్ రాథోడ్ జిల్లా అధికారులు ఉన్నారు.