బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ముకరంపుర, ఆగస్టు 15(విజయక్రాంతి): కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభ్యున్నతి కోసం, భవిష్యత్తు తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఐక్యంగా ఉండి ముందుకు కొనసాగాలని తెలిపారు.
'వికసిత్ భారత్' లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ జి. రమేష్, మాజీ ఎమ్మెల్యే శోభక్క, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు , 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మీడియా సెల్ కన్వీనర్ కటకం లోకేశ్, ఉప్పర పల్లి శ్రీనివాస్ , కార్పొరేటర్లు, బిజెపి రాష్ట్ర ,జిల్లా నాయకులు కార్యకర్తలు ,వివిధ మోర్చా బాధ్యులు, మండల, నగర జోన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.






