15 August, 2026 | 2:57 PM

జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఎగురవేత

15-08-2026 02:13 PM

నిర్మల్ ,ఆగస్టు 15 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఎస్పి బైంసా ఏ ఎస్ పి సాయి కిరణ్ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జెండాను ఏఎస్పీ సాయి కిరణ్ ఆవిష్కరించారు. భారతదేశంలో స్వాతంత్ర కోసం ఎందరో మహావీరులు ప్రాణత్యాగం చేశారని వారి సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ జిల్లా పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.