15 August, 2026 | 2:59 PM

దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

15-08-2026 02:20 PM

వార్డు మెంబర్ బొంగరం భాగ్యమ్మ

కోదండరావుపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాఠశాల విద్యార్థులకు బహుమతుల పంపిణీ

సిద్దిపేట రూరల్,ఆగస్టు15: (విజయక్రాంతి): దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోదండరావుపల్లి గ్రామ 5 వ వార్డు మెంబర్ బొంగరం భాగ్యమ్మ అన్నారు. కోదండరావుపల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బొంగరం భాగ్యమ్మ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పరీక్షల ప్యాడ్స్  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వి ఆర్ ఆర్ ఆర్ టీం సభ్యుడు బొంగరం రజినీకాంత్ రెడ్డి తోపాటు గ్రామ యువకులు విద్యార్థులు పాల్గొన్నారు.