వ్యవసాయంలో సాంకేతికత అవసరం
02-04-2026 12:00 AM
నిర్మల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : వ్యవసాయ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధ వారం కలెక్టర్ కార్యాలయంలో సారంగాపూర్ మండలం కౌట్ల మ్యాక్స్ కొను గోలు చేసిన డ్రోన్ పిచికారి యంత్రాన్ని ప్రారంభించారు. సబ్సిడీపై యంత్రాలను అందజేశారు. నిర్మల్ జిల్లాలో కూలీల కొరత తగ్గించేందుకు ఈ టెక్నాలజీని పరిచయం చేయడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్. సారంగపూర్ మాజీ జెడ్పిటిసి పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అధికారులు నాగరాజు వసంతరావు మ్యాక్స్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.




