మేనల్లుడే వారసుడు
24-06-2024 01:14 AM
- మాట మార్చిన మాయావతి
న్యూఢిల్లీ, జూన్ 23: బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మళ్లీ తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌నే ఎంపిక చేసుకొన్నారు. గత నెలలో లోక్‌సభ ఎన్నికల మూడోదశ పోలింగ్ రోజే ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్త పోస్టు నుంచి మాయావతి తప్పించారు. అప్పటికే ఆయనను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన మాయావతి.. ఆ హోదా నుంచి కూడా తప్పించారు. ఆకాశ్‌కు పూర్తి పరిణతి వచ్చేవరకు ఏ పదవీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సితాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన అభ్యంతరకర భాషను ఉపయోగించటంతో మాయావతి వేటు వేశారు. నెల రోజుల్లోనే ఆమె మాట మార్చారు. ఆదివారం లక్నోలో నిర్వహించిన సమావేశంలో ఆకాశ్‌ను తిరిగి తన వారసుడిగా ప్రకటించారు.






