09-02-2026 01:32:40 AM
ములకలపల్లి, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్ కొత్త చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రములోని సిపిఎం కార్యాలయంలో కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల పట్ల బిజెపి ప్రభుత్వం ద్వంద విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వo కార్పొరేట్, పెట్టుబడిదారీ విధానాలను విడ నాడే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమిస్తారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం తీసుకువస్తున్న
నాలుగు లేబర్కోడ్ చట్టాలు అమలులోకి వస్తే కార్మికులు అనేక హక్కులు కోల్పో యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12 న జరిగే సార్వత్రిక సమ్మె లో కార్మికులు, కర్షకులు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి నూప భాస్కర్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి కిషోర్,ఏఐకెఎమ్‌ఎస్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఉమర్,సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు,ఓరుగంటి శ్రీను, గడ్డం వెంకటేశ్వర్లు,పాయం ముత్యాలు,ఈర్ల సాంబశివరావు,సవళ్ళ ఆదినారాయణ పాల్గొన్నారు.