calender_icon.png 9 February, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చవిటిగూడెం హత్య కేసులో నిందితుడి అరెస్ట్

09-02-2026 01:31:15 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోని చవిటిగూడెం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6వ తేదీన భాతిక విజయ్ను మంచం కర్రతో కొట్టి హత్య చేసిన ఘటనకు సంబంధించి, అతని సోదరుడు బాతిక అరుణ్ను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 6వ తేదీన మృతుడు భాతిక విజయ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లి బాతిక సత్యవతిని విపరీతంగా కొట్టడంతో కుటుంబంలో గొడవ జరిగింది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న మంచం కర్రతో కొట్టడంతో భాతిక విజయ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మణుగూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడైన బాతిక అరుణ్ను ఈరోజు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.