calender_icon.png 6 November, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే మూడు దశాబ్దాలు వెక్టర్ డేటాబేస్‌లదే..

06-11-2025 12:10:04 AM

* మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు

పటాన్ చెరు, నవంబర్ 5 :రాబోయే మూడు దశాబ్దాలు వెక్టర్ డేటాబేస్ లకు చెం దుతాయని, అభివృద్ధి చెందుతున్న డేటా ప్రపంచంలో అందుకు అనుగుణంగా ఉండటానికి గణితంపై పట్టు సాధించాలని హైద రాబాదు విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు సూచించారు.

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితం, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ‘వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో డేటా సైన్స్ పా త్ర’ అనే అంశంపై బుధవారం ఆయన ఆతి థ్య ఉపన్యాసం చేశారు. ప్రొఫెసర్ రావు సై న్స్ యొక్క సారాంశం, గణితం యొక్క పా త్ర, డేటా ఆధారిత సమస్య పరిష్కారానికి పెరుగుతున్న ఔచిత్యం గురించి ఆలోచించమని విద్యార్థులను ప్రేరేపించారు.

‘అవసరం ఆవిష్కరణకు తల్లి’ అని చెబుతూ, ట్రాఫిక్ అంచనాలు, మౌలిక సదుపాయాల ప్రణాళిక, నిర్ణయం తీసుకోవడం వంటి సంక్లిష్ట సవాళ్లను గణిత మోడలింగ్, డేటా సైన్స్ ఎ లా పరిష్కరించగలవో ఆయన వివరించారు. తొలుత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మ ల్లికార్జునరెడ్డి అతిథిని స్వాగతించగా, ప్రొఫెసర్ బీ.ఎం నాయుడు, డాక్టర్ జాదవ్ గణేష్ ప్రొఫెసర్ రాఘవేంద్రరావునుసత్కరించారు.