calender_icon.png 6 November, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిందపడిన ట్రాన్స్‌ఫార్మర్ పొంచి ఉన్న ప్రమాదం

06-11-2025 12:09:07 AM

వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టిన విద్యుత్ అధికారులు

ఎల్లారెడ్డి, నవంబర్ 5(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం పరిధిలోని ఆజామాబాద్ వెల్లుట్ల ప్రధాన రహదారిపై మంగళవారం నాడు కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి దానికి ఉన్న తీగలు, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం కింద  పడిపోయాయి.

వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది బుధవారం  నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను బిగించి విద్యుత్ తీగలను సరిచేసి ఆయా గ్రామాల ప్రజలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు వేగంగా మరమ్మత్తు పనులు చేపట్టారు.

గంటల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు చేపట్టి 24 గంటలు గడవకముందే యధావిధిగా మరమ్మత్తులు చేసిన లైన్మెన్ కాశీరాం, రవి లను విద్యుత్ శాఖ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.