9 May, 2026 | 11:29 AM

శృతిమించుతున్న హిజ్రాల ఆగడాలు

23-06-2024 12:05 AM
  1. వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వైనం
  2. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): నగరంలోని పలు ఏరియాల్లో హిజ్రాల ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులు, ప్రయాణికులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు.  డబ్బులు ఇవ్వని వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.  ఈ క్రమంలో వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు హిజ్రాల ఆగడాలపై కొరడా ఝుళిపించారు. శనివారం మాదాపూర్ ఐకియా షోరూమ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.