16 April, 2026 | 4:52 AM

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం

06-12-2025 12:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

భైంసా( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో ఈనెల 17న జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. భైంసా డివిజన్లోని భైంసా లోకేశ్వరం బాసర కుబీర్ ముధోల్ తానూర్ మండలాల పరిధిలో 131 గ్రామపంచాయతీలకు సర్పంచ్ వార్డు సభ్యులకు నామినేషన్లను చివరి రోజు ఫోటో పోటీగా దాఖలు చేశారు. ఆయన నామినేషన్ కేంద్రాల వద్ద వివిధ రాజకీయ పార్టీల మద్దతు దారులు నామినేషన్లను వేశారు. దీంతో జిల్లాలో మూడు విడుదల నామినేషన్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు.

జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎటువంటి అంతరాయాలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడించారు.శుక్రవారం సాయంత్రం బైంసా మండలం మాటేగాం గ్రామంలోని నామినేషన్ కేంద్రా న్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

మూడవ దశ పంచాయతీ ఎన్నికలకు సం బంధించి నామినేషన్ల స్వీకరణ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులతో మాట్లాడారు. బ్యాంకు ఖాతాల తెరవడంలోనూ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలోనూ, అలాగే నామినేషన్ కేంద్రాల్లోనూ ఎటువంటి ఇబ్బందు లు ఎదురయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఎంపీడీఓ నీరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.