16 April, 2026 | 6:33 AM

అభివృద్ధికి అడిగితే నోటికొచ్చినట్లు అంటావా?

06-12-2025 12:00 AM

-నీ రాసలీలలు అక్రమ సంబంధాల సీడీలు భద్రంగా ఉన్నాయి

-మాజీ మంత్రి జోగుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): అదిలాబాద్ నియోజకవర్గ అభివృ ద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సీఎం ని కలిసి అభివృద్ధి కోసం నిధులు అడిగితే అక్రమ సంబంధం అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అక్కసు వెళ్ళగకుతున్నారని మాజీమంత్రి జోగు రామన్న పై  ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేని జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు .

పదేళ్లు అధికారంలో ఉండి ఆయన చేయలేని పనులను ఒక్కటొక్కటిగా పూర్తవుతుంటే ఓర్వలేక కల్లమంటతో మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాకు ఎయిర్ పోర్టు తేవడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ముఖ్యమంత్రిని కలిసి కోరితే దాన్ని అక్రమ సంబంధం అనడం ఎంత వరకు సమంజసమో ఆయనకే తెలియాలన్నారు. అధికా రంలో ఉండి అభివృద్ధి చేయకుండా కేవలం కమిషన్ లను దండుకొని అక్రమ సంపాదనకు అలవాటు పడిన నువ్వు మాట్లాడడం ఆశ్చర్యం వేస్తుందని అన్నారు.

జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన యూనివర్సిటీ,  టెక్స్టైల్ పార్క్ లు  పక్క జిల్లాలకు తరలిపోతుంటే అధికారంలో ఉండి  నువ్వు చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోకర్, బ్రోకర్ అయి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా అని మాట్లాడుతున్నావ్ అక్రమ సంబంధాల గురించి నువ్వు మాట్లాడడం వింతగబుందన్నారు.  నీ అక్రమ సంబంధం, రాసలీలల సీడీ లు భద్రంగా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దని మాజీ మంత్రి కి ఎమ్మెల్యే చురకలు అంటించారు.

30 ఏళ్లుగా మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని ప్రయత్నిస్తుంటే, సీసీఐ నీ అమ్ముతున్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఎమ్మెల్యేగా, మంత్రి గా పనిచేసిన నువ్వు దిగజారి మాట్లాడితే నేను కూడా దిగజారి మాట్లాడితే నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగు రవి, దినేష్ మటోలియా, రఘుపతి, భరత్, ధోని జ్యోతి. రాకేష్, కృష్ణ, భీమ్సేన్ రెడ్డి, మోహన్ అగర్వాల్,  రాజేష్ తదితరులు పాల్గొన్నారు.