22 March, 2026 | 12:45 PM

చెత్త తరలించే కంటైనర్ల సంఖ్య పెంచాలి

22-03-2026 12:00 AM

కుషాయిగూడ మార్చి 21 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎడిషనల్ కమిషనర్ ప్రసాద్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా కాప్రా సర్కిల్ ప్రాంతాల్లో మసీదులు, దర్గాలు వద్ద సానిటేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. పరిశీలనలో, గ్రీన్ వేస్ట్ నిర్వహణలో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

రామ్కీ ట్రాన్స్ఫర్ స్టేషన్లో ఇంటింటి నుండి సేకరించబడిన చెత్తను సక్రమంగా తరలించేందుకు కావలసిన కంటైనర్ల సంఖ్య పెంచాలని, అలాగే కుషాయిగూడ వాసవి, శివనగర్ ప్రాంతంలో ప్రైవేట్ స్థలం లో డంప్ చేసిన గ్రీన్ వేస్ట్ను వెంటనే తొలగించవలసిందని అధికారులను సూచించా రు. ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, సానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్ రామకృష్ణ, శ్రీనివాస్ ఎస్, సుజాత, వసంత, రామ్కీ ఉప్పల్ జోనల్ ఇంచార్జ్ కృష్ణ, కాప్రా సర్కిల్ ఇంచార్జ్ నవీన్ కుమార్ రెడ్డి, సూపర్వైజర్ శృతి తదితరులు పాల్గొన్నారు.