23 May, 2026 | 2:25 AM

ఎత్తున ప్రాంతాలకు నీరు అందించడమే లక్ష్యం

23-05-2026 01:36 AM

జనగామ, మే 22 (విజయక్రాంతి): జనగామ నియోజకవర్గం నర్మెట మండలం గండీరామారం పంప్ హౌస్ వద్ద కొనసాగుతున్న దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-1 పనులను శుక్రవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, ఇంజినీర్లతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు త్వరితగతిన సాగునీరు అందించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల  మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వత సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. జనగామ, హన్మకొండ జిల్లాల్లోని తరిగొప్పుల, చిల్పూర్, ధర్మసాగర్, వేలేరు, మండలాలకు సాగునీటి పరిష్కారం కల్పించేందుకు రూ.110 కోట్లతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మంజూరు చేయించామని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే అప్పటి సీఎం కేసీఆర్ తో కలిసి తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.110 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించుకున్నామని తెలిపారు.

దేవాదుల పైపులైన్ ఆధారంగా మూడు మినీ ఎత్తిపోతల పథకాలను రూపకల్పన చేసి వేలాది ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని, ఈ పనులకు 2023 ఫిబ్రవరి 27న అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. తరిగొప్పుల మండలాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో గండీరామారం రిజర్వాయర్ ఆధారంగా రూ.63.80 కోట్లతో లిఫ్ట్-1 ఇరిగేషన్ పథకాన్ని చేపట్టామని ఎమ్మెల్యే వివరించారు.

ఈ లిఫ్ట్ ద్వారా తరిగొప్పుల, అబ్దుల్ నాగారం, నర్సాపూర్,అంకుషాపూర్, సోలిపురం, పోతారం, బొత్తగట్టు నాగారం, భోజ్య తండా, జాల్ బాయ్ తండా, మానిసింగ్ తండా తదితర గ్రామాలు, తండాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. తొలి దశలో 4వేల ఎకరాలకు నీరు అందుతుందని, భవి ష్యత్తులో మరో 10 వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. పంపు హౌస్ వరకు అప్రోచ్ కాలువ పనులు కొనసా గుతున్నాయని, మరో రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి అవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 30లోపు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాను కూడా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను జూలై 15 లోపు తరిగొప్పులలో ఇప్పటివరకు సాగునీరు అందని ఎత్తున ప్రాంతా లకు కూడా నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తరిగొప్పుల మండలానికి నీళ్లు తీసుకురావడం తన అదృష్టంగా భావి స్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ పనుల కోసం నిరంతరం అధికా రులతో, ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ అంశం పై చర్చిస్తున్నా మని, అసెంబ్లీలో కూడా ఈ సమస్యను ప్రస్తావించి రిప్రజెంటేషన్ ఇచ్చామని వెల్లడించారు.

గండిరామారం పంపు హౌస్ కు పోయే క్రమంలో గ్రామాల్లో వేసిన పైప్ లైన్ ను పరిశీలించడం, ఈ స్కీమ్ లో నీళ్లు చేరని కుంటలకు కూడ పరిశీలించాలని అధికారులకు తెలియచేయడం జరిగిందన్నారు. ఈ కార్య క్రమంలో తరిగొప్పుల బిఆర్‌ఎస్ మండల నాయకులు పింగిలి జగన్మో హన్ రెడ్డి, మాజీ జడ్పి చైర్మన్ పద్మ నర్సింగ రావు, బిఆర్‌ఎస్ నాయకులు పెద్ది రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పద్మజ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జూంలాల్, మాజీ అధికార ప్రతినిధి లింగం, మాజీ సర్పంచ్ ప్రభుదాస్, అర్జుల సంపత్ రెడ్డి, సోలిపురం సర్పంచ్ శ్రీను, నర్మెట సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కంతి ఆంజనేయులు, బొత్తల పర్రె సర్పంచ్ రవి నాయక్, తాళ్లపల్లి రాజేశ్వర్ ఏదునూరు సుధాకర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.