పాత పెన్షన్ పునరుద్ధరించాలి
18-08-2026 12:26 AM
కౌకుంట్ల, ఆగస్టు 17 : ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసానిచ్చే పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వెంటనే పునరుద్ధరించాలని, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డి మాండ్ చేశారు. కౌకుంట్ల మండల కేంద్రం లో స్థానిక తహశీల్దార్ సుందర్ రాజ్, ఎంపీడీవో శివప్రసాద్లతో కలిసి ఆగస్టు 23న నిర్వ హించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్సీపీఎస్‌ఈయూ మండల అధ్యక్షురాలు నాగమణి, ప్రధాన కార్యదర్శి బుచ్చన్న, కోశాధికారి శివకుమార్, ఎంపీవో రమేష్, నాయకులు పవన్, అశోక్, నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.






