26 February, 2026 | 12:48 PM

ప్రతిపక్షం దూతగా వ్యవహరించాలి

25-02-2026 12:00 AM

ఉద్ధృతమంత్రో దూతప్రణిధిః, 

అమాత్యసంపదోపేతో నిసృష్టార్థః,

పాదగుణహీన: పరిమితార్థః, 

అర్థగుణహీన: శాసనహర:

 (కౌటిలీయం 1-12)

ఏ కార్యాచరణకైనా మంత్రాంగం నిశ్చితమైన పిమ్మట దూతలను ప్రయోగించాలి. ఆ దూతలకు ఉండాల్సిన లక్షణాలను చెపుతూ.. దక్షులైన అమాత్యులు లేదా నిర్వహణాధికారులు ఏయే గుణ సం పదలు లేదా అర్హతలు కలిగియుండాలో అ లాంటి అర్హతలు కలిగిన దూతలు ఉత్తము లు.. వారిని “నిసృష్టార్థులు” అంటాడు చాణక్య.

కార్యభారాన్ని పూర్తిగా తమపై వేసుకొని నిర్వహించగలిగిన సమర్ధత కలిగిన ని సృష్టార్థులపై కార్యభారాన్ని పూర్తిగా విడిచివేయవచ్చు. వారిలో సగం గుణాలు కలిగిన వారిని ‘పరిమితార్థులు’ అంటూ వారి అర్హతననుసరించి వారికి పరిమితమైన కార్యభా రాన్ని మాత్రమే అప్పగించాలి. నిసృష్టార్థుల లో సగం గుణాలు కూడా లేనివారు ‘శాసనహరులు’గా చెప్పబడ్డారు. వారికి రాజు పం పే వార్తలు తీసుకొని వెళ్లే పనులు మాత్రమే అప్పగించాలి, అంటాడు ఆచార్య చాణక్య.

దూత లక్షణాలు..

దూతకు ఉండాల్సిన లక్షణాలను రామాయణం చక్కగా చెప్పింది. మొదటిసారి శ్రీరాముని చూసిన హనుమంతుడు సంక్షిప్తంగా, సందేహానికి తావు లేకుండా మాట్లాడాడు. ఆగిఆగి మాట్లాడడం, అర్థరహితంగా పదాలను విడగొట్టుతూ పలకడం, తొందరపాటు తో పదాలను ఉచ్చరించడం అతనిలో కనిపించలేదు. ఆత్మవిశ్వాసంతో, వినయంతో, అవిలంబితంగా;(ఆగకుండా తత్తర పాటు లేకుండా);క్రమంగా (శబ్దోచ్చారణలో శాస్త్రీ య పద్ధతి), తన మనసులోని మాటను స్ఫ ష్టంగా చెప్పాడు. మరీ బిగ్గరగా కాకుండా, అ లాగని సన్నగా కాకుండా మధ్యమ స్వరంతో మాట్లాడాడు.

భావాన్ని వ్యక్తీకరించేందుకు అనువైన పదాలను ఎన్నుకొని సంస్కారవంతమైన భాషను అవసరమైన అంతరాల్లో పలకడం వల్ల ఆ మాటలు మృదు మధురం గా ఉన్నాయని రాముడు లక్ష్మణుడితో అం టాడు. సాగతీసి మాట్లాడడం, వేగంగా మా ట్లాడడం, తలను కదిలిస్తూ మాట్లాడడం; (ఇది; నిర్లక్ష్యాన్ని తెలుపుతుంది), రాసుకొని వచ్చి చూసుకుంటూ మాట్లాడడం, కంఠస్థం చేసింది అప్పచెప్పినట్లుగా మాట్లాడడం, అర్థం తెలియని పదాలను ఉపయోగిస్తూ మాట్లాడడం లాంటి ఆరు దోషాలూ లేకుం డా, సమయస్ఫూర్తితో, ఏవిధములైన వికారాలూ ముఖంపై కనిపించకుండా మాట్లాడ గలిగిన దూత కార్యసాధకుడుగా మన్ననలు పొందుతాడు.

దేశ ప్రయోజనాలు..

రాజ్యపాలన అనేది రాజు, మంత్రి, అ మాత్యులు.. అందరి సమష్టి బాధ్యత. రాజు లేదా పాలకుడు ఇంద్రునిలాగా సహస్రాక్షు డై ఉండాలి. అంటే వేయి కన్నులతో పరిస్థితులను ఎల్లప్పుడూ గమనిస్తుండాలి. ‘ఇంద్ర స్యహి మంత్రి పరిషదృషీణాం సహస్రమ్, న తచ్చక్షుః తస్మాదిమం ద్వ్యక్షం సహస్రాక్షమాహు’.. ఇంద్రునికి రెండు కన్నులే అయినా అతని మంత్రి పరిషత్తులో ఉండే వేయి మంది ఋషులే అతనికి నేత్రాలు. అందుకే అతనికి సహస్రాక్షుడు అనే పేరు వచ్చిందంటారు రేమెళ్ల అవధానులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకులు మంత్రులుగా ప్రజల హక్కులను పరిరక్షించాలి. రాజకీయం కన్నా రాజ్య రక్షణ ముఖ్యమైనది.

ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల పాత్రను చాణక్య కాలం నాటి రాజరికపు పాలనకు అన్వయించడం కుదరకపోవచ్చు. నేడు సమాజంలో రాజును పాల కపక్ష నేతగా, మంత్రిని ప్రతిపక్షనేతగా, అమాత్యులను రాష్ట్రాల పాలనాధినేతలుగా చెప్పు కుంటే.. వారంతా దేశ ప్రజలకు సుపరిపాలనను అందించడం, శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడం లక్ష్యంగా పనిచేయాలి. ప్రతిపక్షాలకు, పాలక పక్షాలకు మధ్య భేదాభిప్రాయా లు ఉన్నా అవి రాజకీయాలకే పరిమితం కావాలి. అంతేకానీ దేశ రక్షణ, భద్రత, గౌరవానికి భంగం కలిగించే విధంగా పరిణమిం చకూడదు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగే సమయంలో వ్యక్తిగత, పార్టీల ప్రయోజనాలను దూరంగా పెట్టి సమష్టి కృషిచేయాలి.

ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నీడలాగా అనుసరించి, ప్రభుత్వ విధానాలను సమీక్షిస్తూ, తప్పులు ఎత్తిచూపుతూ ప్రజలకు న్యా యం చేయాలి. ప్రభుత్వం చేసే ఉచితానుచి త నిర్ణయాలను ప్రజలకు తెలియచేస్తూ పారదర్శకత నెలకొనే విధంగా చూడాల్సిన బా ధ్యత ప్రతిపక్షానిదే. భారత్ వ్యూహాత్మక ఆలోచనలతో అమెరికా, రష్యా వంటి విభిన్న దృ క్పథాలు కలిగిన శక్తులతో ఏకకాలంలో స్నే హ సంబంధాలను కొనసాగించడం, ‘క్వాడ్’ వంటి కూటముల్లో పాల్గొని శక్తి సమతుల్యతను చాటడం, దేశ ప్రయోజనాల విధానా న్ని పాటించడం లాంటి అంశాల్లో పాలక, ప్రతిపక్షాలు కలసి పని చేసినప్పుడే దేశ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.

తలదించుకునే స్థితి..

ఆర్థికంగా, పటిష్టంగా నిలబడలేని జాతి స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. వేగం గా మారుతున్న సాంకేతిక యుగంలో దాని తో పరుగులు తీయలేని జాతి నిర్జీవంగా మారుతుంది. విలువలతో కూడిన ప్రాచీన భారతీయ విజ్ఞానానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ ప్రగతిపథంలో విశ్వగురువు గా ఎదిగే సంకల్పంతో ముందుకు సాగుతున్న భారతదేశ ప్రతిభా పాటవాలను; యావత్ ప్రపంచం గౌరవిస్తున్నా, దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు మాత్రం ప్రపంచం ముందు తలవంచుకునే విధంగా ప్రవర్తించ డం గర్హనీయం.

ఇటీవల భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ప్రపంచ ఏఐ సమావేశ మందిరంలో స్వార్థపర శక్తులు విద్యాసంస్థల ముసుగులో (గల్గోటియస్ విశ్వవిద్యాల యం) చైనా రోబో కుక్కను తమదిగా ప్రకటించడం, అదే ప్రాంగణంలో ప్రతిపక్ష నేతల అర్థనగ్న ప్రదర్శనలు జాతి పరువుకు భంగం కలిగిస్తున్నాయని చెప్పాలి. అలాగే ప్రధానమంత్రిని చుట్టుముట్టేందుకు మహిళా స భ్యులు సన్నద్ధమవడం, ప్రచురితం కాని సైనికాధికారి పుస్తకాన్ని ఉటంకిస్తూ పార్లమెం టులో, పార్లమెంటు వెలుపల సైనిక బలాల నైతికతను దెబ్బతీసేందుకు సన్నద్ధమవడం ప్రతిపక్షాలకు సమంజసం కాదు. భారతదేశ ఆర్థిక మూలాలను సుంకాలతో దెబ్బతీయాలని భావించే దేశాలను అడ్డుకోవడమే గాక భారతీయ విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రశ్నించడం సరికాదు.

అప్రమత్తత..

భారతదేశం అనాదిగా ‘లోకాస్సమస్తాస్సుఖినో భవంతు’ అన్న విధానానికి కట్టుబ డి ప్రజలను పాలించింది. నిజానికి భారతం అంటే ‘అగ్నిమిచ్ఛధ్వం భారతాః’ అంటుంది వేదం. భారతం అగ్ని, శక్తి, ఉత్సాహం, సృజనాత్మతలకు ప్రతీకగా పేర్కొంటారు. శక్తిని, ఉత్సాహాన్ని, సృజనాత్మకతను కోరుకునేవారు భారతీయులు.

శక్తిని సద్వినియోగం చేసుకోవడం వల్ల సృజనాత్మకత వెలుగుచూస్తుంది. సృజనాత్మకత నవ్యతను, అభ్యు దయాన్ని అందిస్తుంది. అయితే అనాదిగా అజ్ఞానం తన ఉనికిని చాటుకోవాలనిచూస్తున్నది. వివేకం, భావోద్వేగాలకు లోనుకాకుం డా ఎవరిని ఎంతవరకు విశ్వసించాలో తెలియజేస్తున్నది. బలమైన వ్యక్తిత్వానికి అప్రమత్తత మార్గదర్శన చేస్తే, ప్రాజ్ఞత అభ్యుదయానికి బాటలు వేస్తుంది.

- పాలకుర్తి రామమూర్తి