26 February, 2026 | 2:41 PM

నిపుణ్ మిషన్ మంచి ఆలోచన!

25-02-2026 12:00 AM

దేశవ్యాప్తంగా మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల ప్రతిభ పాటవాలను గుర్తించేందుకు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్) ఉపయోగపడనుంది. దీనిని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పరాక్ విభాగం నిర్వహించనున్నది. మూడవ తరగతి విద్యార్థులకు చదవడం, రాయడం, సంఖ్య నైపుణ్యాన్ని అంచనా వేయడానికి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మార్చి రెండోవారం లోపు పరీక్షను పూర్తి చేస్తారు.

2026 విద్యా సంవత్సరం చివరినాటికి గ్రేడ్ విద్యార్థులకు ప్రాథమిక అక్షరాస్యతను నిర్ధారించుటకు లక్ష్యంగా పెట్టుకున్నదే నిపుణ్ భారత్ మిషన్. అభ్యాస ఫలితాలను కొలవడానికి, సుస్థిరాభివృద్ధి ప్రమాణాల కోసం ఎఫ్‌ఎల్‌ఎస్ ఉద్దేశించింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎస్ పై మూడో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. మన రాష్ర్టం కూడా ఎఫ్‌ఎల్‌ఎస్‌లో ముందంజలో ఉండాలని ఆకాంక్షిద్దాం. 

 రావుల రామ్మోహన్ రెడ్డి, జనగామ