19 August, 2026 | 3:12 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి

28-04-2026 01:17 AM

మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నిర్మల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా -ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హైదరాబాదులో సమీక్ష నిర్వ హించారు. హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుతున్న సమీక్షలో  పాల్గొన్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు నగేష్,  గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు  దండే విఠల్,  అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్,

రామారావు పటేల్, పాయల శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్ బాబు, అధికారులు రెవిన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్,  హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత, నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర అధికారులు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు మంజూరు అయిన ఇల్లు పూర్తయిన ఇల్లు, స్లాబ్ లేవని, సాంకేతిక సమస్యలు, బిల్లుల మంజూరు, జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసినందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.