ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
బూర్గంపాడు, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధన రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు, గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో సబ్బండవర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేశారని అన్నారు.
తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి రానుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పొక్కుల రవి,లక్ష్మీపురం ఉప సర్పంచ్ యారం పున్నారెడ్డి, మాజీ వార్డు మెంబర్ కామిరెడ్డి పద్మ, మూల బాలిరెడ్డి గారు, కురుకుంట్ల చిన్నప్పరెడ్డి, చేతుల పెద్ద వీర్రాజు, గంగుల చంద్రశేఖర్ రెడ్డి, బొర్ర భద్రయ్య, కొప్పుల గిరి, టెలీఫోన్ రాము, షేక్ జమల్, షేక్ మౌలానా, నాగులమీర, నిజాముద్దీన్ పాల్గొన్నారు.






