08-01-2026 01:47:45 AM
ములుగు/తాడ్వాయి, జనవరి 7 (విజయక్రాంతి): జాతర సమీపిస్తున్నందున మేడా రంలో జరుగుతున్న అభివృద్ధి, సౌకర్యాల పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం అభివృద్ధి పనులను కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కెకాన్, ఐటిడిఏ పీవో చిత్ర మిశ్రాలతో కలిసి సీతక్క పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. శుక్రవారంలోపు ఆర్చ్ పిల్లర్లు, సంబంధిత నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో సభ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు ముక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శనాలు కల్పించాలని, ప్రతి పనిని గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.