08-01-2026 01:47:45 AM
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఏటా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ సారి జనవరి 13- తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్స్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని తెలిపారు. 13 తేదీల్లో గచ్చిబౌలిలో డ్రోన్ షో నిర్వహిచబోతున్నామని చెప్పారు.
బుధవారం సచివాల యంలో మీడియాతో మంత్రి జూపల్లి మాట్లాడారు. కైట్ ఫెస్టివల్‌లో 19 దేశాలకు చెందిన 40 మంది పాల్గొంటారని, డ్రోన్ షోలో భాగంగా అత్యాధునిక ఎల్‌ఈడీ డ్రోన్లతో గగనతల విన్యాసాలు ఉంటాయని, తెలంగాణ పర్యాటక ప్రాంతాల డిజిటల్ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ఈ ఈవెంట్స్‌కు అందరూ రావాలని పిలుపునిచ్చారు. పర్యాటక రంగా న్ని బలోపేతం చేస్తున్నామని ప్రకృతి సంపదను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు.