calender_icon.png 9 January, 2026 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు

08-01-2026 01:48:56 AM

సిద్దిపేట క్రైం, జనవరి 7 : సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. బుధవారం సైబర్ జాగృత దివాస్ పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ వివరించారు.

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని సూచించారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జీవన్, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, అధ్యాపకులు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.