calender_icon.png 1 May, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమ్ముకాస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి

24-04-2025 12:44:28 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో బుధవారం గాం ధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా, పెద ముస్లిం ప్రజల అభ్యున్నతికి అడ్డుకట్ట వేసి, ఈ రోజు భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘సభ్ కా సాత్...

సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్‘ నినాదం తో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించడం పై మత విద్వేషపు విషాన్ని చిమ్ముతున్న  ఎం ఐఎం పార్టి నీ ఓడించి, రజాకర్ పార్టీ కి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ లకు బుద్ధి చెప్పాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఓటు హక్కును వినియోగించుకునే ప్రజా ప్రతినిధులను కోరారు.