25 August, 2026 | 2:08 AM

అధిష్ఠానం కన్ను అందరిపై ఉంది!

25-08-2026 01:18 AM
  1. కాంగ్రెస్ క్రమశిక్షణ గల జాతీయపార్టీ
  2. ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం ఎందుకు అడ్డుకుందో సమాధానం చెప్పాలి
  3. మంథనిలో మీడియాతో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, ఆగస్టు 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన విధివిధానాలు, క్రమశిక్షణ ఉన్నాయని, ఎవరు ఏం చేస్తున్నా రో అధిష్ఠానం కన్ను అందరిపై ఉందని, అం దరినీ నిశితంగా గమనిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్ప ష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను కేంద్రం ఎందుకు అడ్డుకుందో సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మంథనిలో మీడియాతో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలో సమస్యలు సృష్టించే వారిపై అధిష్ఠానం నిఘా పెట్టింద న్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదని సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ అని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం, పార్టీ పూర్తి క్రమశిక్షణతో ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు, ఇటీవల చోటుచేసుకుం టున్న పరిణామాలపై స్పందిస్తూ పార్టీలో ఎవరెవరు ఏవిధమైన కార్యకలాపాలు సాగిస్తున్నారో కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికప్పుడు గమనిస్తోందని, క్రమశిక్షణ తప్పితే అధిష్ఠానం చూస్తూ ఊరుకోదని పరోక్షంగా హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పర్యటనను కేంద్రం అడ్డుకోవడం అన్యాయం అన్నారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లండన్‌లో చదువుకుని దేశానికి దిశానిర్దేశం చేశారని, అదే తరహాలో ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలను తెలంగాణకు రప్పించి, రాష్ర్టంలో వందలాది మంది అంబేద్కర్‌లను తీర్చిదిద్దాలన్నదే సీఎం ఆలోచన అని వివరించారు. అలాంటి ఉన్నతమైన లక్ష్యంతో అమెరికా విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, చర్చల కోసం వెళ్లాలనుకున్న ముఖ్యమంత్రిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ కారణంతో అడ్డుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.