30 March, 2026 | 1:52 AM

రాజ్యాధికారంలో వాటాదారుడు కార్యకర్త

30-03-2026 12:11 AM
  1. బహుజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు

అంకితభావంతో ముందుకు కదలాలి

టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

కార్వాన్, గద్వాల నుంచి పార్టీలో చేరికలు

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): కార్యకర్త అంటే కేవలం జెండా మోసేవాడు మాత్రమే కాదని, రేపటి రాజ్యాధికారంలో సమాన వాటాదారుడని తెలం గాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం కార్వాన్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరారు. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి ఆర్. భావన, కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జీ టీవీఆర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత మల్లన్న వీరికి కండువాలు కప్పి సాదారంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు బహుజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంకిత భావంతో ప్రతీ టీఆర్పీ కార్యకర్త ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయి న ఓదెలు, పార్టీలో చేరిన వారు తదితరులు పాల్గొన్నారు. 

గద్వాలలో చేరికలు..

పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, ఉపాధ్యక్షులు ఓదెల యాదవ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చా ర్జ్ కొమ్మల ప్రవీణ్ రాజు ఆధ్వర్యంలో గద్వాలకు చెందిన ప్రముఖ అడ్వకేట్ బోయ పరశురాం తన అనుచర వర్గంతో కలిసి పార్టీలో చేరారు. తీన్మార్ మల్లన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు తెలంగాణ లో ప్రజా సమస్యల పరిష్కారమే తమ పార్టీ లక్ష్యమని, గ్రామస్థాయిని నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజలకు చేరువవుదామని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు ఆకర్షించినందువల్లే టీఆర్పీలో చేరానని అడ్వకేట్ బోయ పరశురాం అన్నారు.