గిరిజనులను ఆదుకోవాలి
- ఏఐబీఎస్సీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు
ఏపీలోని కావలిలో యానాది గిరిజన మహాసభ
హైదరాబాద్, మార్చి 29(విజయ క్రాంతి): ఎరుకల యానాది నక్కల గిరిజను లను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐబీఎస్సీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు డిమాండ్‌చేశారు. ఆదివారం ఆంధ్ర ప్రదేశ్‌లోని కావలి పట్టణంలో ఎరుకల యానాది నక్కల గిరిజన మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ.. తాను ఎస్పీగా పనిచే శానని, 70 పోలీస్ స్టేషన్లు, 100 ఎస్‌ఐలు, పాతిక సీఐలు, ఐదు డీఎస్పీలు, ఎన్నో సమస్యలు పరిష్కరించామని చెప్పారు.
కానీ అప్పటికి ఇప్పటికీ ఈ జిల్లా రెడ్ల చేతిలోనే ఉన్నదని, పాలించే పార్టీలు మారినా రెడ్లు మాత్రంమారరని, వాళ్లు ఎమ్మెల్యేలు కాబట్టి మన సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా రాజ్యమే లాలన్నారు. గిరిజన చెంచుగూడేల్లో, తండాల్లో ఎరుకల, యనాది కాలనీలలో ప్రభుత్వం ప్రత్యేక వసతులతో కూడి న రోడ్లు, స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలు, వాటర్‌ట్యాంకులు, గృహనిర్మాణాలు, రేషన్ కార్డులు సమకూర్చాలని, ప్రత్యేక అధికారులను నియమించి ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు.
ప్రకాశం జిల్లా కరేడు ప్రాంతంలో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల జీవనాధారం కోల్పోయిన యానాది గిరిజన ప్రజలకు ప్రత్యేకప్యాకేజీ కేటాయించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న బకింగ్ హోమ్ కెనాల్‌లో చేపల వేట ద్వారా జీవనభృతి పొందే యానాది గిరిజనులకు మత్స్యకార లైసెన్సులు ఇవ్వాలని, ఎరుకల బాతుల పెంపక సహకార సంఘం ఏర్పాటుచేసి, రవాణా, మార్కెటింగ్ సౌక ర్యం కల్పించాలన్నారు. ఎరుకలకు పందుల పరిశ్రమస్థాపనకు రూ.20 లక్షలు తగ్గకుండా 75 శాతం సబ్సిడీతో లోన్ ఇవ్వాలన్నారు.
అల్పసంఖ్య జనాభా గల మైదాన ప్రాంత గిరిజన తెగలైనా కృష్ణ చెంచు, నక్కల, కమ్మర, అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు.- మైదాన ప్రాంత గిరిజనులకు ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యే స్థానాలను రిజర్వు చేయాలని సూచించారు. నెల్లూరు కేంద్రంగా ఉన్న యానాది ఐటీడీఏ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలన్నారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా పేద గిరిజన కుటుంబాలకు 90 శాతం సబ్సిడీ రుణాలను నాన్ బ్యాంక్ మంజూరు చేయాలి.
చెంచులు నివసించే నల్లమల అటవీ ప్రాంతాన్ని షెడ్యూలు 5 కింద ఏజన్సీ ప్రాంతంగా ప్రకటించాలని, గిద్దలూరు అటవీ ప్రాంతంలో టైగర్ జోన్ ఏర్పాటువల్ల బ్రతుకు దెరువు కోల్పోయిన వెదురుబుట్టలల్లే ఎరుకలకు ప్రత్యామ్నాయ పునరావాశం క్రింద 90 శాతం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ పక్షాన విజయక్రాంతి దినపత్రిక ప్రచురిచిన కథనాల ప్రతులను వేదికపై నేతలకు అందజేశారు.




