ప్రపంచానికి శాంతిమార్గం అత్యవసరం
అహింస స్థూపం ఏర్పాటులో వీహెచ్‌పీ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ప్రపంచానికి శాంతి మార్గం అత్యం త అవసరమని, జైన సిద్ధాంతాల బోధనలు మానవాళికి దారి చూపుతాయని విశ్వహిం దూ పరిషత్ రాష్ట్ర ధర్మచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పేర్కొన్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం వైశాలినగర్ కూడలిలో అహింస స్తూపం ఏర్పాటుకు అఖిల భారత జైన్ మహిళా పరిషత్ అధ్యక్షురాలు శిల్పా జైన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బాలస్వామి ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. శాంతిసాధనలో ప్రతీవ్యక్తి ముందుకు రావాలని, సౌహార్ద వాతావరణం నెలకొల్పడానికి జైనతత్వం ఎంతో ముఖ్యమన్నారు. హింస వాతావరణానికి చరమగీతం పడాలంటే జైన సిద్ధాంతమైన అహింసావాదాన్ని ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జైన సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






