పట్టాదారు పాస్‌బుక్ పోయింది
పోలీసులకు బాధితుడు లోలం శేఖర్ ఫిర్యాదు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఒక వ్యక్తి తన అసలు పట్టాదార్ పాస్‌బుక్ పోగొట్టుకున్నారు. మేడిపల్లి పరిధిలో నివాసముంటున్న బాధితుడు లోలం శేఖర్ గురువారం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదుచేశారు. హనుమకొండ జిల్లా ఖాజిపేట్ మండలం మడికొండ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన అసలు పట్టాదార్ పాస్‌బుక్ (నంబర్: T21080024045) తన వద్ద ఉండేదని పేర్కొన్నారు.
ఈ భూమి తన అధీనంలో ఉండటంతోపాటు సంబంధిత అధికార పత్రాలు కూడా తన వద్దే ఉన్నట్టు తెలిపారు. మార్చి 28, 2026న హనుమకొండ నుంచి తన నివాసానికి వస్తుండగా ఫీర్జాదిగూడ బస్‌స్టాప్ వద్ద దిగిన సమయంలో ఒక ఫైల్ పోగొట్టుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫైల్‌లో అసలు పట్టాదార్ పాస్‌బుక్‌తోపాటు ఏజీపీఏ డా క్యుమెంట్ జిరాక్స్ కాపీ కూడా ఉన్నట్టు వెల్లడించారు.
ఆ ప్రాంతంలో వెతికినా ఫైల్ కనబడలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసిన శేఖర్, పోయిన పత్రాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని, అవి దొరకని పక్షంలో లాస్ సర్టిఫికేట్ జారీచేయాలని పోలీసులను కోరారు. తద్వారా డూప్లికేట్ పట్టాదార్ పాస్‌బుక్ పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




