3 April, 2026 | 4:23 AM

5న మాదిగ మహాశక్తి సంఘం ఆవిర్భావం

03-04-2026 01:58 AM

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

ముషీరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మాదిగలను రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ‘మాదిగ మహా శక్తి’ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిం హులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించా రు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ, రాజ్యసభలో  సీట్లలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశా రు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబానికి రెండు, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి మూడు సీట్లు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మాదిగ జాతి బాగు కోసం తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఈనెల 5న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సంఘం జెండా ఆవిర్భావం చేయనున్నట్లు వెల్లడించారు.

మాదిగ ఓట్లు మాదిగలకే వేసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని ఉన్నానని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొ. కనకయ్య, విజయ్ కుమార్, డా.చిలుక భాస్కర్, కేవీఎల్.ఎన్.రావు, వినయ్ కుమార్, పీ స్పెన్ రెడ్ పాల్గొన్నారు.