calender_icon.png 22 December, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పార్టీకి అధికారం ఇచ్చి తప్పు చేశామంటున్న ప్రజలు

22-12-2025 02:42:54 AM

మొయినాబాద్, డిసెంబర్ 21(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తెచ్చి తప్పు చేశామని...మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులుగా వార్డు సభ్యులుగా గెలుపొందిన ఎర్ర జైపాల్ ఉపసర్పంచ్గా ఎన్నికైనారు.

బీఆర్‌ఎస్ వార్డు సభ్యులుగా జీనుకుంట రాజు, ముంజగల్ల శశీధర్, ముంజగల్ల వనజవిజయ్కుమార్, జీనుకుంట రోజామహేందర్లను ఆదివారం బీఆరెస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు మనోజ్కుమార్ ఆధ్వర్యంలో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థులకు దీటుగా గట్టి పోటీ ఇచ్చారని తెలిపారు. మండలంలో అధికార పార్టీ కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని తెలిపారు.

ఇంకా నాలుగు స్థానాలు గెలువాల్సి ఉండగా బీఆర్‌ఎస్ నుంచే అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ చేయడంతో ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చిన వాళ్లం అయ్యామని చెప్పారు. ప్రజల్లో బీఆర్‌ఎస్ సానుకూలంగా ఉందని,ప్రభుత్వంపై ప్రజలు కోపంతో ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచు కోవడానికి అవకాశం ఉందని అన్నారు.

ఓడిన వారు కూడ అధైర్య పడకుండ ధైర్యం గా ప్రజల మధ్యలో ఉంటూ మంచి రోజుల కోసం ఎదిరిచూడాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ పి జగన్మోహన్రెడ్డి, సీనియర్ నాయకులు జయవంత్, పరమేష్, సత్తిరెడ్డి, ఎర్ర సురేష్, రాంచందర్, బంటు విష్ణు, కె వెంకటేష్, నవీన్కుమార్, ఎర్ర శ్రీకాంత్, టీ మహేందర్, నర్సింహ్మ, సదాశివ, సన్నీ పాల్గొన్నారు.