22-12-2025 02:40:22 AM
ఎల్బీనగర్‌లోని కామినేని దవాఖానలో చికిత్స పొందుతున్న హైడ్రా కమిషనర్ గన్‌మెన్
ఆర్థిక ఇబ్బందులు, బెట్టింగ్ యాప్‌లకు బానిస
పరామర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఎల్బీనగర్, డిడిసెంబర్ 21(విజయ క్రాంతి): హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత గన్ మెన్ ఆదివారం ఉదయం తన తూపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఎల్బీనగర్ లోని కామినేని దవాఖానకు తరలించ గా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, బెట్టింగ్ యాప్ ల్లో నగదు కోల్పోవడంతో గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాయటి కృష్ణచైతన్య 2020 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ (హైదరాబాద్)గా ఉద్యోగం చేస్తూ మునగనూర్ పరిధిలోని సాయిసూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత భద్రతా అధికారి (PSO)గా కృష్ణచైతన్య పనిచేస్తున్నాడు. కాగా, ఆదివారం ఉదయం కృష్ణచైతన్య తన నివాసంలో సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనకు గల కారణం ఇంకా తెలియరాలేదు. కృష్ణచైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్ యాప్ లో భారీ మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. కృష్ణచైతన్య ఆత్మహత్యయత్నానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
విషమంగా ఆరోగ్య పరిస్థితి
కృష్ణ చైతన్య (32) తన సర్వీసు రివ్వాలర్ తో తలకు గురిపెట్టుకుని కాల్చుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణచైతన్యకు కామినేని దవాఖానలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మెదడుకు చేసిన సిటి స్కాన్లో పుర్రెకు, మెదడుకు తీవ్రమైన పగుళ్లు ఉన్నట్లు గుర్తించిన న్యూరోసర్జన్లు (డాక్టర్ ఎంఏ జలీల్, డాక్టర్ సాయిశివ) శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కృష్ణచైతన్య ఇంటెన్సివ్ న్యూరోక్రిటికల్ కేర్లో ఉన్నారు.
పరామర్శించిన రంగనాథ్
కృష్ణచైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్ యాప్ లో భారీ మొత్తంలో డబ్బు లను పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి ఆత్మహ త్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. గన్మ్యాన్ కృష్ణచైతన్య ఆత్మహత్య యత్నం విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామినేని ఆస్పత్రికి చేరుకుని, అతని ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ విషయాన్ని సంచలనం చేయెద్దని సూచించారు.
రెండు సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్లు/గేమింగ్ యాప్లలో భారీ మొత్తంలో నగదు కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పుల కారణంగా అతడికి అతి తక్కువ వేతనం అందు తుందన్నారు. దాదాపు 3 నెలల క్రితం అతను కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటి నుండి వెళ్లిపోయాడు. అప్పు డు హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందైనట్లు చెప్పారు. కృష్ణచైతన్య విధుల్లో బాగానే ఉండేవాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.