22-12-2025 02:44:01 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కమిషనర్ స్థాయి
విచారణ ఇదే తొలిసారి
సీసీ సెంటర్‌లో కీలక భేటీ.. పూర్తి ఛార్జ్‌షీట్‌కు ఆదేశాలు
సిట్ ఆఫీస్ మార్పుపైయోచన
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 21 (విజయక్రాంతి): యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్లుమైక్స్ దశకు చేరుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ను విచారించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఏసీపీ, డీసీపీ, జాయింట్ సీపీ స్థాయి అధికారుల విచారణకే పరిమితమైన ఈ కేసులో.. ఏకంగా పోలీస్ బాస్ ఎంట్రీ ఇస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ నేతలు, అధికారులను ఎవరినీ వదలొద్దు అని సిట్ అధికారులను ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యూహరచన
బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ అత్యవసర సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. దర్యాప్తు పురోగతిని సమీక్షించిన ఆయన, అధికారులకు దిశానిర్దేశం చేశా రు. ఈ కేసులో దర్యాప్తును మరిం త వేగవంతం చేసి, సాక్ష్యాధారాలతో కూడిన పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టవద్దని సీపీ స్పష్టం చేశారు. ఇందులో ప్రమే యం ఉన్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఎవరినీ ఉపేక్షించేది లేద ని, అంద రినీ విచారించి చట్టపరమైన చర్య లు తీసుకోవాలని సిట్ బృందానికి తేల్చిచెప్పారు.
సిట్ అధికారులు ప్రభాకర్‌రావును గత కొన్ని రోజులుగా విచారిస్తున్నప్పటికీ, కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానాలు రాబట్టలేకపోతున్నట్లు సమాచా రం. ఈ నేపథ్యంలో నేడు సీపీ సజ్జనార్ స్వయంగా జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ప్రభాకర్ రావుతో ముఖాముఖి జరపనున్నారు. ఫోన్ ట్యాపిం గ్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? కేవలం మీ నిర్ణయమేనా? లేక ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశారు? డేటా ధ్వం సం ఎం దుకు చేశారు? అనే కోణంలో సీపీ లోతుగా విచారించనున్నారు. ఒక పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి నేరు గా నిందితుడిని విచారించడం ఈ కేసులో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
శనివా రం ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టే షన్‌లో సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయి తే, భద్రతా కారణాల దృష్ట్యా, గోప్యత పాటించేందుకు సిట్ కార్యాలయాన్ని మార్చే యోచ నలో ఉన్నట్లు సీపీ తెలిపారు. శనివారం మధురానగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ.. ‘దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ ఆఫీస్ మార్పుపై ఆలోచిస్తు న్నాం. త్వరలోనే కేసు పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తా నికి నేడు సీపీ ఎంట్రీతో ఫోన్ ట్యాపింగ్ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, రాజకీయ వర్గాల్లో గుబు లు మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.