03-12-2025 12:19:45 AM
నిర్మల్, డిసెంబర్ ౨ (విజయక్రాంతి): జిల్లా పరిషత్తుల ద్వారా ఆయా మండలాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరు వ చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జెడ్పి సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్లు పాయిజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ ను కలిసి పూలబోకి అందించారు.
జెడ్పి ఉద్యోగుల్లో పారదర్శక విధులు నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ నారాయణ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు