03-12-2025 12:18:45 AM
జిల్లాలో జోరు నామినేషన్లు
నిర్మల్, డిసెంబర్ ౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ఘట్టం మంగళవారం ముగిసింది. జిల్లాలోని ఈనెల 14న రెండో విడతగా జరగనున్న సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు చివరి రోజు అయిన మంగళవారం పో ట పోటీగా నామినేషన్లను దాఖలు చేశారు. నిర్మల్ సోన్ నిర్మల్ రూలర్ దిల్వార్పూర్ సారంగాపూర్ కుంటాల నర్సాపూర్ తదితర మండలాల్లోని 136 గ్రామ పంచాయతీలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు ఆధారంగా వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులు పోటీగా నామినేషన్లను సమర్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నామినేషన్ కేంద్రాల్లో అధికా రులు టోకెన్లు జారీ చేసి నామినేషన్ పత్రాలను రాతి వరకు స్వీకరించే విధంగా చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ ఆర్డిఓ రత్నా కళ్యాణి సబ్ కలెక్టర్ సాయి సంకేత్ కుమార్ తదితరులు సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.
ఎన్నికల నియమావళి పాటించాలి
నిర్మల్ జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటిస్తూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు సహకరించాలని జిల్లా ప్రత్యేక పరిశీలకులు ఆయేషా ముస్రత్ ఖాన్ అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని ఆయా నామినేషన్ కేంద్రాలను తనిఖీ నిర్వహించి ఎన్నికల సిబ్బందికి సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారులు ఉన్నారు