03-12-2025 12:21:05 AM
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, డిసెంబర్ ౨ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్రమ దోపిడీ కి హీల్ట్ పాలసీ నిదర్శనమని బిజెఎల్‌పి నేత మహేశ్వర్ రెడ్డి మరోసారి ఆరోపించారు. మంగళవారం నిర్మల్ లో ఆయన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన అంశాలన్నీ అబద్ధపు మాటలుగా పేర్కొన్నారు.
పారిశ్రామికరణ పేరుతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వారికి దారా దత్తం చేసిందికి ప్రభుత్వం ఈ పాలసీ రూపొందించినట్టు బిజెపి ఆరోపిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని పరిశ్రమల పేరుతో ప్రజా సంపదను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ చేపడుతున్న చర్యలను మాత్రమే వ్యతిరేకిస్తున్నా మన్నారు. 22 మల్టీ జోన్ల పరిధిలోని 92 92 ఎకరాలు ప్రభుత్వ భూమిని తక్కువ ధర కి కార్పొరేట్ పెద్దలకు అప్పగించేందుకు ప్రభు త్వం ఈ పాలసీ రూపొందించిందని ఆరోపించారు.
ఈ పాలసీ ద్వారా 129 లక్షల కోట్ల అవి నీతి అక్రమాలు జరిగే అవకాశం ఉందని దీని పై బిజెపి ఇప్పటికే రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. ఈ పాలసీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం స్పందించి అనుమానాలను నివృత్తి చేయవలసిన మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసబద్దపు మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇప్పటి కైనా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు న్యా యం జరిగేలా చూడాలని లేకపోతే బిజెపి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లఎంద్రకన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ పార్టీ నాయకులు చందు తదితరులు పాల్గొన్నారు