18 April, 2026 | 2:20 AM

బీఆర్‌ఎస్ పక్షాన ప్రజలు ఉంటారు

18-04-2026 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): వాంకిడి మండలం ఎనోలి గ్రామానికి చెందిన సుమారు 20 మంది బీజేపీ నాయకులు శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వాంకిడి బీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారు ఎమ్మెల్యే  నివాసంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ  ప్రజల్లో బీఆర్‌ఎస్పు వి శ్వాసం పెరుగుతోందన్నారు. గ్రామ స్థాయి లో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పిలు పునిచ్చారు.

పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, కలిసి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచిం చారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పను లు, కార్యకర్తలపై చూపుతున్న ఆప్యాయతకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్ సోయం సంజీవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ జాబ రి పేంటు, శ్రీను, రాజ్ కుమార్, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.