18 April, 2026 | 2:18 AM

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

18-04-2026 12:00 AM

చెన్నూర్, ఏప్రిల్ 17 : ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల దీర్ఘకాల పెండింగ్ సమస్యలపై టీజీ జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు చెన్నూర్ తహసిల్దార్‌కి టీజీ జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజే శారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర సేవా వింగ్ కో కన్వీనర్ సయంపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వివిధ దశల్లో కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీర్చకపోవడం దారుణమన్నారు. అందుకే దశల వారి ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.

20 23 జూన్ నుంచి అమలు కావాల్సిన పిఆర్సి ఇప్పటికీ కూడా నివేదిక తెప్పించుకోలేదని ఆవేద న వ్యక్తం చేశారు. అలాగే పెం డింగ్ డిఏలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డులు, సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ అనేక సమస్యలపై తమ ఎన్నికల  మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఈ హామీలన్నీ అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా కార్యదర్శి నాగరాజు, తోడె తిరుపతి, పెన్షనర్ ఉద్యోగుల ప్రతినిధులు పురాణం శంకర్, రాపర్తి శ్యామ్ సుందర్,  సుధాకర్ రెడ్డి, రత్న లక్ష్మీనారాయణరెడ్డి తదితకరులు పాల్గొన్నారు.