07-02-2026 12:45:56 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీలను నోట్లో మట్టి కొట్టిన బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి గుట్టెంగారి మాధవరెడ్డికి గులాబీ కండువా కప్పి ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటుందని బీసీ సమాజానికి సంకేతం ఇచ్చిన కేసీఆర్ చారిత్రక తప్పు చేసిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నా రు.
ఈ మేరకు శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జాజుల లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముం దు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో తాము అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన నిరంతర ఒత్తిడి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసిన విషయం తెలిసిందేనన్నారు.
బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 విడుదల చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ, బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి కోర్టులో కేసులు వేసి పెంచి న రిజర్వేషన్లు కోర్టుల ద్వారా కొట్టి వేయించారన్నారు. దీంతో బీసీ ల నోటి కార్డు ముద్దును గుంజేసి బీసీలు తినే కంచంలో మన్నుపోసిన ఘనుడు మాధవరెడ్డి అని జాజుల ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లు తగ్గించడం మూలం గా బీసీలు వేలాది సర్పంచ్ స్థానాలను, కౌన్సిలర్ కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్ ఎంపీటీసీ, జెడ్పీ టీసీ కోల్పోయే అవకాశం ఏర్పడిందన్నారు. బీసీలను తడి గుడ్డతో గొంతు కోసి బీసీలను రాజకీయం గా అణిచేయాలని కుట్రతో 60 శాతం జనా భా ఆకాంక్షలను ఆశలను, ఆశయాలను తుంగలోకి తొక్కిన బీసీల ద్రోహి మాధవరెడ్డిని ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ముడిచింతలపల్లి మున్సిపాలిటీ నుంచి కేశవాపూర్ పదో వార్డు కౌన్సిలర్ గా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి ఎన్నికల బరిలో మీరు నిలపారన్నారు.
బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకైనా మాధవ రెడ్డికి గులాబీ కండువా కప్పి బీసీల మనోభావాలను బీసీల ఆత్మ గౌరవా న్ని, బీసీల రాజకీయ ఆకాంక్షలను బీఆర్‌ఎస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆయనకి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడం ద్వారా స్పష్టంగా సందేశం ఇచ్చినట్లయిందన్నారు.
కారు గుర్తు మీద మాధవరెడ్డిని గెలిపించాలని ఇప్పటికే మీ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారన్నారు. నిజంగా బీఆర్‌ఎస్‌కి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మాధవరెడ్డిని పార్టీ నుంచి సస్పెం డ్ చేయాలని బీసీ సమాజం డిమాండ్ చే స్తుంది అని జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ బీసీల వైపు న్యాయం ఉందని భావిస్తే మీరు చేసిన ఈ బీసీ విద్రోపు చర్యను తక్షణమే ఉపసంహరించుకొని బీసీ సమాజానికి క్షమాపణ కోరి బీసీల పక్షాన నిలబడాలని మిమ్ములను కో రుతున్నామన్నారు. మీ నిర్ణయం 48 గం టలు వెల్లడిస్తారని ఆశిస్తున్నాం.. లేని పక్షం లో తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీల పక్షాన ప్రజాస్వామ్యుతంగా మీ బీసీ వ్యతిరేక వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖలో పేర్కొన్నారు.