25 February, 2026 | 6:27 AM

ఖాతాల్లోకి రానీ మోదీ పైసలు.. అయోమయంలో రైతన్నలు

25-02-2026 01:10 AM

నేటివరకు డబ్బులు పడక రైతుల అవస్థలు 

అయిజ ఫిబ్రవరి 24 అయిజ మండలంలోని రైతుల సమస్యలు పట్టించుకోని వ్య వసాయ అధికారులు అంటూ రైతులు గోస పెడుతున్నారు. కొంతమంది దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పైసలు రావడం లేదని రైతులు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నామ ని, కేంద్ర ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హా మీలు వేరని అమలు చేస్తున్న హామీలు ఇం కొకటిని రైతులు ఆవేదన చెందుతున్నారు.

2018 లోపు ఎవరి పేరు మీద అయితే భూమి రిజిస్టర్ అయిందో వారికి ప్రతి రైతుకు ఎకరమునకు 6000 విడతల వారీగా ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తున్నారని, గద్దెనెక్క డం కోసం హా మీలు ఇస్తూ గద్దెనెక్కిన తర్వాత మాట మా రుస్తున్నారు అని రైతులలో చర్చ జరుగుతుంది.

కొంతమంది రైతులు ఈ కేవైసీ చే యించలేదంటూ, మరియు కొంతమంది రైతులకు ఈ కేవైసీ అప్డేట్ కాలేదని, వయసు పైబడిన రైతులకు వేలిముద్రలు సరిగా పడక, కొంతమంది రైతులకు,బ్యాంక్ అ కౌంట్ తప్పుగా నమోదయిందంటూ రైతులను ఆఫీసులో చుట్టూ తిప్పుకుంటున్నారంటూ రైతులు అనుకుంటున్నారు. సమస్యలను జిల్లా అధికారి దగ్గరకు వెళ్లి తెలియజేసిన మళ్లీ ఇక్కడికే తిప్పి పంపుతున్నారు. అసలు సమస్య ఎక్కడున్నది మాకు బోధపడడం లేదు. ఇకనైనా పై అధికారులు కానీ కింది అధికారులు కానీ రైతుల సమస్యలు పరిష్కరించవలసిందని రైతులు అనుకుంటున్నారు.

మూడు నెలలుగా సైట్ పని చేయడం లేదు .... 

కేంద్ర ప్రభుత్వం రైతుబంధు విషయం లో కొన్ని సవరణలు జరుగుతున్న నేపథ్యం లో మూడు నెలలుగా సైట్ బంద్ అయిన మాట వాస్తవమేనని తదుపరి ప్రభుత్వ ని బంధనల మేరకు పై అధికారుల సహకారం తో రైతుల సమస్యలు పరిష్కరించుటకు ప్రయత్నం చేస్తాం

జనార్దన్, వ్యవసాయ అధికారి, అయిజ