25 February, 2026 | 4:10 AM

శంకర్‌పల్లి లిటిల్ స్టార్స్ హైస్కూల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రవీణ్ కుమార్‌కు సన్మానం

25-02-2026 01:10 AM

శంకర్ పల్లి, ఫిబ్రవరి 24.(విజయ క్రాంతి): శంకర్ పల్లి పట్టణంలోని లిటిల్ స్టార్ హై స్కూల్ మంగళవారం శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్. ప్రవీణ్ కుమార్ కు పాఠశాల యాజమాన్యం శాలువతో సత్కరించి సన్మానించారు. చైర్ పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ జూలకంటి శ్వేత పాండురంగారెడ్డి, మూడో వార్డు కౌన్సిలర్ గుండ గిరిజ చంద్రశేఖర్, శంకర్ పల్లి మాజీ సర్పంచ్ వై. ప్రకాష్ గుప్తాలను శాలువులతో సత్కరించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వారిని సన్మానించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో కూడా మీరంతా పై పదవులకు ఎన్నికై ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల యాజమాన్యం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.

ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలపాలని కోరారు. ఈ పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సమయంలో స్వర్గీయ భాస్కర్ సార్ కోకో కోకో కబడ్డీ వంటి పాటలను ఆడిపించేవారని గుర్తు చేసుకున్నారు.

శంకర్ పల్లి పట్టణంలో మొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల లిటిల్ స్టార్ హై స్కూల్ అని అన్నారు. పాఠశాల నడిపించడానికి ఎంతో ఇబ్బందులు కలిగిన స్వర్గీయ భాస్కర్ సార్ ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, ఏం సి డైరెక్టర్ సర్ తాజ్, బి. ప్రణీత్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.